Thursday, 12 March 2026 03:36:34 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Rajendra Prasad: వార్న‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు... క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజేంద్ర ప్ర‌సాద్‌

'రాబిన్‌హుడ్' ఈవెంట్‌లో వార్న‌ర్‌పై రాజేంద్ర ప్ర‌సాద్ అనుచిత వ్యాఖ్య‌లు మాజీ క్రికెట‌ర్‌ను ఉద్దేశించి నటకిరీటి చేసిన కామెంట్స్ వైర‌ల్ దీంతో ఆయ‌న‌పై దు

Date : 25 March 2025 04:08 PM Views : 642

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. ఈ నెల 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆసీస్ మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యేక అతిథిగా విచ్చేశాడు. అయితే, రాబిన్‌హుడ్ ఈవెంట్‌లో వార్న‌ర్‌పై సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. మాజీ క్రికెట‌ర్‌ను ఉద్దేశించి నటకిరీటి చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై దుమ్మెత్తిపోశారు. ఈ నేప‌థ్యంలో తాను వార్న‌ర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్ స్పందించారు. తాను ఆ వ్యాఖ్య‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వి కావ‌ని, త‌న మాట‌లు ఎవ‌రినైనా నొప్పిస్తే సారీ అని అన్నారు. "నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లు అందరికీ నమస్కారం. మొన్న రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ మీద నా నోటి నుంచి అనుకోకుండా ఓ మాట దొర్లింది. అది నేను ఉద్దేశపూర్వకంగా చేసింది మాత్రం కాదు. నా గురించి మీకు తెలియనిది కాదు. ఆ ఫంక్షన్‌కి వచ్చే ముందు మేమంతా కలిసున్నాం. ఎంత అల్లరి చేశామంటే... నితిన్‌ని, అతడ్ని (వార్నర్ ని) మీరంతా నా పిల్లల్లాంటోళ్లు అన్నా. అనేసి ఊరుకోకుండా నేను వార్నర్‌ని గట్టిగా వాటేసుకొని నువ్వు యాక్టింగ్‌లోకి వస్తున్నావ్‌గా రా నీ సంగతి చెప్తా అన్నా. దానికి మీరు క్రికెట్‌లోకి రండి మీ సంగతి చెప్తా అని వార్నర్ అన్నాడు. ఇలా చాలా అల్లరి చేసి ఆ ఫంక్షన్‌కి వచ్చాం. ఏది ఏమైనా ఐ లవ్ వార్నర్. ఐ లవ్ హిజ్ క్రికెట్. అలానే వార్నర్ మన సినిమాల్ని.. మన యాక్టింగ్‌ని చాలా ఇష్టపడతాడు. నాకు తెలిసి మేము ఒకరికి ఒకరం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన మీ మనసుల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. అయినా కూడా నేను సారీ చెబుతున్నా. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుందాం" అని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :