Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉండడమే ఇందుకు కారణం. డిసెంబర్ 5న సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఇక యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం అక్కడ ఏకంగా 1.25 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సుమారు 45 వేలకి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దాంతో బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప గాడి రూల్ ప్రారంభమైందని కామెంట్లు పెడుతున్నారు.
Also Read : పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
Admin
Studio18 News