Saturday, 07 March 2026 07:56:51 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Sangharshana : ‘సంఘర్షణ’ మూవీ రివ్యూ..

Date : 10 August 2024 10:49 AM Views : 351

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sangharshana Movie Review : చైతన్య, రసీదా భాను జంటగా తెరకెక్కిన సినిమా సంఘర్షణ. మహీంద్ర పిక్చర్స్ బ్యానర్ పై వల్లూరి శ్రీనివాస రావు నిర్మాణంలో చిన్న వెంకటేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శివ రామచంద్రపు, ఎక్స్ ప్రెస్ హరి, స్వాతిశ్రీ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సంఘర్షణ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేసారు. కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అనుకోకుండా వీరి జీవితాల్లో ఒక సంఘటన జరుగుతుంది. దాంతో వాళ్ళ జీవితంలో రిస్క్ ఏర్పడుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ ని పోలీస్ ఆఫీసర్ దీపక్ (శివ) ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటాడు. వరుసగా మర్డర్స్ జరుగుతున్నా ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో దీపక్ కి పైనుంచి ప్రెజర్ పెరుగుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? దీపక్ కిల్లర్ ని పెట్టుకున్నాడా? ఆ మర్డర్స్ కి చైతన్య, సంయుక్తలకు సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ.. ఇటీవల సీరియల్ కిల్లింగ్ అంటూ క్రైం థ్రిల్లర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందింది. సమాజంలో జరుగుతున్న ఓ క్రైం సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. స్క్రీన్ ప్లేని థ్రిల్లింగ్ గానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హత్యలు జరుగుతుండటం పోలీసులు దాన్ని పట్టుకోలేకపోవడంతో ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేయడంతో పాటు కథ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్.. మెయిన్ లీడ్స్ లో చైతన్య, రసీదా బాగానే నటించారు. పోలీసాఫీసర్ గా శివ రామచంద్రపు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎక్స్ ప్రెస్ హరి అక్కడక్కడా కామెడీని పండించాడు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు.. థ్రిల్లింగ్ అంశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. కొత్త దర్శకుడు చిన్న వెంకటేష్ మొదటి సినిమాని బాగానే హ్యాండిల్ చేసి పర్వాలేదనిపించారు. నిర్మాణ పరంగా నిర్మాత వల్లూరి శ్రీనివాస్ రావు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా సంఘర్షణ ఒక క్రైం థ్రిల్లర్ సినిమా. థ్రిల్లింగ్ సినిమాలు చూసేవాళ్లకు నచ్చుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :