Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kajal Aggarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తని కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక బాబుకి తల్లి అయిన సంగతి తెలిసిందే. గతంలో ఆల్రెడీ తన కొడుకు నీల్ కిచ్లు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఓ వ్యాపార సంస్థ దీపావళి ప్రమోషన్ కోసం తన కొడుకుని సంప్రదాయంగా తయారుచేసి.. కాజల్, నీల్ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో నీల్ కిచ్లు ఫేస్ కనిపించకుండా లవ్ సింబల్ వేసింది. ఆల్రెడీ గతంలో నీల్ ఫేస్ చూపించిన కాజల్ ఇప్పుడు ఎందుకు ఫేస్ కనిపించకుండా పోస్ట్ చేసింది అని అభిమానులు, నెటిజన్లు సందేహం వ్యక్తపరుస్తున్నారు.ప్రస్తుతానికి కొడుకుతో కలిసి క్యూట్ గా దిగిన కాజల్ ఫోటోలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News