Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చిన చిన్న సినిమాలలో ఒకటి, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'లగ్గం'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాను వేణుగోపాల్ రెడ్డి నిర్మించగా, రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సాయిరోనక్ .. ప్రగ్యా నగ్రా హీరో - హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్ .. రోహిణి .. ఎల్ బి శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మణిశర్మ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి. చైతన్య హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కూతురు మానసను చైతన్యకి ఇచ్చి వివాహం చేయాలని అతని మేనమామ అనుకుంటాడు. ఈ విషయాన్ని గురించి తన చెల్లెలితో మాట్లాడతాడు. ఆమె కూడా తన కొడుకును ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనేది కథ
Also Read : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అరెస్ట్ వెనక అసలు కారణం వేరే ఉందట.. వెల్లడించిన అమెరికా
Admin
Studio18 News