Sunday, 08 March 2026 10:43:23 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఢిల్లీలో రెడ్అలర్ట్ జారీ.. మూతపడ్డ పాఠశాలలు.. పలు విమానాలు రద్దు

Date : 01 August 2024 11:46 AM Views : 249

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Heavy Rains In Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతోపాటు కుండపోత వర్షం కురవడంతో ఢిల్లీకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 22ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె ప్రమాదవశాత్తూ ఘాజీపూర్ ప్రాంతంలో డ్రైనేజీలో పడి మరణించారు. భారీ వర్షం కారణంగా రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. విద్యాశాఖ మంత్రి అతిషి ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ -నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో కూడా భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్దీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లుకూలి వ్యక్తికి గాయాలయ్యాయి. వసంత్ కుంజ్ లో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. కుండపోత వర్షం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ వెళ్లే 10 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :