Sunday, 08 March 2026 04:15:44 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Pechi: అడవిలో వెంటాడే దెయ్యం .. ఓటీటీలో భయపెడుతున్న 'పేచి'

Date : 25 September 2024 05:09 PM Views : 381

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న హారర్ థ్రిల్లర్ సినిమాలలో 'పేచి' ఒకటి. తమిళంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను భయపడుతోంది. టైటిల్ తోనే అందరిలో ఉత్కంఠను రేకెత్తించిన సినిమా ఇది. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, గాయత్రి .. శరణ్య .. దేవ్ రామ్ నాథ్ .. ప్రీతి .. జనా .. తదితరులు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ కథ అంతా కూడా ఫారెస్టు నేపథ్యంలో నడుస్తుంది. ఒక యువజంట సరదాగా ఈ అటవీ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ మంట వేసుకోవడానికి పుల్లలు అవసరం కావడంతో, వాళ్లు ఒక చెట్టు నుంచి ఎండిన కొమ్మను నరుకుతారు. ఆ కొమ్మను నరికిన చోటు నుంచి ఒక భయంకరమైన బొమ్మ బయటికి వస్తుంది. ఆ యువజంట ఏమైపోయింది ఎవరికీ తెలియదు. ఆ తరువాత కొంత కాలానికి ఐదుగురు స్నేహితులు ట్రెక్కింగు కోసం అదే ఫారెస్టుకు చేరుకుంటారు. లోకల్ గైడ్ 'మారి'ని వెంటబెట్టుకుని అడవి లోపలికి చేరుకుంటారు. ఒక చోట నిషేధిత ప్రాంతాన్ని సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఉంటుంది. ఆ ప్రాంతంలో దెయ్యాలు తిరుగుతుంటాయని రాసి ఉంటుంది. మారి చెబుతున్నా వినిపించుకోకుండా ఈ స్నేహితులు అటుగా వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే కథ. రాజేశ్ మురుగేశ్వరన్ అందించిన నేపథ్య సంగీతం, పార్తీబన్ కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :