Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara : హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే సందడి మనకు తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే అర్ధరాత్రి నుంచే థియేటర్స్ వద్ద హడావిడి చేస్తారు. తమ హీరోలకు కటౌట్లు, బ్యానర్లు, పూల దండలు, పాలాభిషేకాలు, టపాసులు పేల్చడం, డప్పులు కొట్టడం.. ఇలా అన్ని రకాలుగా తమ హీరో సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ దేవర సినిమా నేడు సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోలు చాలా థియేటర్స్ లో వేశారు. దీంతో ఆ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు. థియేటర్ బయట కటౌట్లు, బ్యానర్లు, పూల దండాలు, పాలాభిషేకాలతో సందడి చేస్తుంటే థియేటర్ లోపల కొంతమంది పేపర్లు ఎగరేస్తూ, హారతులు ఇస్తూ, పూలు విసురుతూ రచ్చ చేస్తున్నారు.
Admin
Studio18 News