Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసుల విచారణకు సీనీ నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ రాజశేఖర్ రెడ్డి సినీ నిర్మాత బన్నీ వాసు కూడా పీఎస్ కు వచ్చారు. అల్లు అర్జున్ ను డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, సెంట్రల్ జోన్ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. బన్నీ ముందు 50 ప్రశ్నలను ఉంచినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరుగుతోంది. చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల నుంచి అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందనే సమాచారాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.
Also Read : స్మగ్లింగ్ చేసే హీరోకు జాతీయ అవార్డులా?: పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
Admin
Studio18 News