Wednesday, 17 December 2025 02:42:28 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

'ఎలివేషన్'(జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Date : 03 November 2025 06:36 PM Views : 154

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యాక్షన్ థ్రిల్లర్ గా 'ఎలివేషన్' క్రితం ఏడాదిలో థియేటర్లకు వచ్చిన సినిమా ఈ నెల 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ఓ మాదిరిగా అనిపించే కంటెంట్ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమానే 'ఎలివేషన్'. క్రితం ఏడాది నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేశారు. ఆంథోనీ మ్యాకీ .. మోరెనా బాకారీన్ ...మాడీ హసోన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జార్జ్ నోల్ఫి దర్శకత్వం వహించాడు. ఈ నెల 1వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇంగ్లిష్ తో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది. కథ: అది 'బోల్డర్' అనే సిటీకి దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతం. దాదాపు 8000 అడుగుల ఎత్తయిన ఆ ప్రదేశంలో కొంతమంది భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంటారు. అందుకు కారణం 'రీపర్స్'గా చెప్పుకునే చిత్రమైన జంతువులు. చూడటానికి మొసలి మాదిరిగా కనిపించే ఈ జంతువులు చాలా వేగంగా పరిగెత్తగలవు. మనిషి శ్వాసను సైతం పసిగట్టి వెంటాడగలవు. మూడేళ్ల క్రితం అవి 'బోల్డర్' నగరంపై దాడిచేస్తాయి. చనిపోగా మిగిలిన కొంతమంది కొండపై తలదాచుకుంటారు. చిత్రమైన ఆ జంతువులు 8000 అడుగులపైకి చేరుకోలేవు. అందువలన నియంత్రణ రేఖను ఏర్పాటు చేసుకుని, ఆ రేఖను దాటి ఎవరూ క్రిందికి రాకుండా జీవిస్తూ ఉంటారు. 'విల్' (ఆంథోని మ్యాకీ) రీపర్స్ కారణంగా తన భార్యను కోల్పోతాడు. అప్పటి నుంచి తన ఎనిమిదేళ్ల కొడుకు 'హంటర్' ఆలనా పాలన అతనే చూసుకుంటూ ఉంటాడు. హంటర్ కొంతకాలంగా శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతనికి ఎప్పటికప్పుడు కుత్రిమ ఆక్సిజన్ అందించే 'ఫిల్టర్స్' మారుస్తూ ఉండాలి. 'విల్'కి సమీపంలోనే నీనా .. టీకే నివసిస్తూ ఉంటారు .. ఇద్దరూ ఒంటరివారే. రీపర్స్ కారణంగా తన ఫ్యామిలీని పోగొట్టుకున్నందుకు 'నీనా' ప్రతీకారంతో ఉంటుంది. రీపర్స్ ను అంతం చేయడానికి తగిన ఆయుధాలను కనుగొనే ప్రయత్నంలో ఆమె ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన కొడుకు కోసం ఉపయోగించే ఫిల్టర్స్ కోసం 'విల్' కొండదిగవలసి వస్తుంది. 'బోల్డర్' సిటీలోని హాస్పిటల్ నుంచి వాటిని తీసుకురావాలసి ఉంటుంది. అయితే కొండదిగితే ఆ జంతువులు చంపేస్తాయని నీనా - టీకే అతణ్ణి హెచ్చరిస్తారు. అయినా అతను వినిపించుకోకపోవడంతో తోడుగా తాము కూడా బయల్దేరతారు. రీపర్స్ వైపు నుంచి వాళ్లకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుంది? రీపర్స్ గురించి వాళ్లకి కొత్తగా తెలిసే విషయం ఏమిటి? తన కొడుకును కాపాడుకోవాలనే విల్ ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. విశ్లేషణ: కొడుకును రక్షించుకోవడం కోసం, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా. ఈ కథ మొత్తంలో మూడే పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి.మిగతా పాత్రలను గురించిన ప్రస్తావన తప్ప, వాళ్లు తెరపై కనిపించరు. కథ అంతా కూడా కొండ ప్రాంతంలోనే జరుగుతుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే తీశారనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. ఈ తరహా కథల్లో చిత్రమైన జంతువులు .. వాటి ప్రత్యేకతలు .. అవి వెంటాడే దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించవలసి ఉంటుంది. వాటికి హీరో బృందం ఎక్కడ దొరికిపోతుందో అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో కలగాలి. కానీ ఆ స్థాయిలో కంగారు పెట్టేసే సన్నివేశాలు తెరపై మనకి పెద్దగా కనిపించవు. అందువలన ఆశించిన స్థాయిలో ఈ సినిమా హడావిడి చేసినట్టుగా అనిపించదు. పనితీరు: కొడుకు ప్రాణాల కోసం తండ్రి తెగించక తప్పని పరిస్థితిని తీసుకొచ్చి, అతణ్ణి ప్రమాదాల బాట పట్టించడమనే లైన్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఆ మార్గంలోని అవాంతరాలు .. వాటిని అధిగమించడం వంటి సన్నివేశాలు ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో ఆవిష్కరించలేకపోయారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ముగింపు: విచిత్రమైన జంతువులు నగరాలపై విరుచుకు పడటం .. దాదాపు అందరినీ చంపేయడం .. మిగిలిన కొందరు వాటిని ఎదుర్కోవడం వంటి కథతో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఆ తరహా కథనే కాస్త తక్కువ ఖర్చుతో చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. Movie Details Movie Name: Elevation Release Date: 2025-11-01 Cast: Anthony Mackie,Morena Baccarin,Maddie Hasson Director: George Nolfi Music: Scott Salinas Banner: Lyrical Media Review By: Peddinti Elevation Rating: 2.00 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :