Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అట్లీ, త్రివిక్రమ్ సినిమాల్లో ఏది ముందు వస్తుందో మాత్రం క్లారిటీ లేదు.
Trivikram – Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డం తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా భారీ హిట్ అయి బాహుబలి రికార్డులు సైతం చెరిపేసింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అట్లీ, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ దర్శకులతో మూడు సినిమాలు ఉన్నాయి. అట్లీ, త్రివిక్రమ్ సినిమాల్లో ఏది ముందు వస్తుందో మాత్రం క్లారిటీ లేదు. అట్లీతో చేసేది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా. కానీ త్రివిక్రమ్ తో మాత్రం మైథాలజీ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడారు.
నాగవంశీ మాట్లాడుతూ.. మేము త్రివిక్రమ్ సర్ – అల్లు అర్జున్ గారితో మైథాలజీ సినిమా చేస్తున్నాము. ఇండియా మొత్తం ఆ సినిమా చూసి ఆశ్చర్యపోతుంది. మన పురాణాల్లో ఉన్న ఓ దేవుడి గురించి చూపించబోతున్నాం. ఆ దేవుడు అందరికి తెలుసు కానీ ఆ దేవుడి లైఫ్ ఏంటి, ఏం జరిగింది అని ఎక్కువ మందికి తెలియదు. దాని గురించి ఈ సినిమా గ్రాండ్ గా ఉండబోతుంది అని చెప్పారు. దీంతో నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News