Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అత్యంత వైభవంగా మన్యం ధీరుడు సినిమా ప్రి-రిలీజ్ ప్రముఖ గాయకులు, నటులు ఆర్.వి.వి. సత్యనారాయణ నిర్మాతగా, అల్లూరి సీతారామరాజుగా ప్రధాన పాత్రలో నటించి అద్భుతమైన రీతిలో చిత్రీకరణ ముగించుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రి-రిలీజ్ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ ముఖ్య అతిధులుగా గౌరవ అతిథులుగా అశోక్ గజపతిరాజు, గంటా రవి, గంటా శారదా, లీడర్ రమణమూర్తి, డాక్టర్ దాడి సత్యనారాయణ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సత్తిపండు హాజరై వారి చేతులు మీదుగా ట్రైలర్, టీజర్ రిలీజ్ జరిగింది. ఇందులో నటించిన నటీ, నటులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హర్షిత, ప్రోగ్రాం కన్వీనర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కోరుకొండ రంగారావు వ్యవహరించారు, ఈ చిత్రానికి దర్శకునిగా నరేష్ డెక్కల,డి.ఓ.పి గా వినీత్ వ్యవహరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు యదార్ధ గాదను అద్భుతంగా చిత్రీకరించారని ఆర్.వి.వి సత్యనారాయణ సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయారని, వారికి విలువిద్యలోనూ కత్తి స్వాములను కర్ర సాములను నిష్ణాతులు అవడం వలన ఎటువంటి డూప్ లేకుండా నటించారని, మిగిలిన పాత్రధారులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారని, లొకేషన్స్ హిమాలయ ప్రాంతాలు, ప్రాచీన గిరిజన గ్రామాలు, దట్టమైన అడవులలో ఎటువంటి డూప్ లేకుండా సత్యనారాయణ నటించారన్నారు. దర్శకత్వం ఎడిటింగ్, కెమెరా, స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా ఉంటుందని అభినందనలు తెలిపారు.
ADVT
Admin
Studio18 News