Wednesday, 17 December 2025 03:53:48 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Renu Desai | సన్యాసం తీసుకునే ఆలోచనలో రేణూ దేశాయ్.. రెండో పెళ్లి నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు?

Renu Desai | ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన‌ రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాల‌కి గ్యాప్ ఇచ్చింది. అనంత‌రం ఇద్దరు

Date : 21 October 2025 08:02 PM Views : 117

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Renu Desai | ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన‌ రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాల‌కి గ్యాప్ ఇచ్చింది. అనంత‌రం ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కొన్నాళ్ళ‌పాటు ప‌వ‌న్‌తో వైవాహిక జీవితం కొన‌సాగించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న వారిద్ద‌రు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ నుండి విడిపోయిన‌ తర్వాత పూణెలో స్థిరపడిన రేణూ, అప్పుడప్పుడు సోషల్ మీడియా లేదా వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ, ఆ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. ఆ సినిమా చేసినప్పుడు నాపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం , అదే నా టార్గెట్ కాదు’’ అని ఆమె ఇటీవల స్పష్టంచేశారు. తనను ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోనని, తాను యాక్టింగ్‌ను కేవలం ప్యాష‌న్‌తో మాత్ర‌మే చేస్తానని చెప్పిన రేణూ, “నాకు యాక్టింగ్ మీద మక్కువ ఉన్నా అది నా జీవన లక్ష్యం కాదు. హీరోయిన్‌గా ఉన్నప్పటి నుంచి సినిమాలు చేస్తూ వచ్చి ఉంటే నాకు మంచి పేరు వచ్చేది” అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణూ తన పిల్లలతోనే ఉంటూ, కరోనా కాలంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ విమర్శలకు తట్టుకోలేక ఆ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్న విష‌యాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ రెండో పెళ్లి గురించి తాను ఓపెన్‌గా మాట్లాడుతూ వ‌చ్చిన రేణూ, ఇప్పుడు మాత్రం మరో షాకింగ్ కామెంట్ చేశారు. “ఇంకో ఏడాది మాత్రమే ఇలా ఉంటాను… ఆ తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్లే అవకాశం ఉంది” అని ఆమె హింట్ ఇచ్చారు. ఈ కామెంట్‌ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న కొన్ని మంచి ఆఫర్లు వస్తున్నాయని, ఇటీవల అత్తా-కోడళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఓ కామెడీ డ్రామా చిత్రానికి సైన్ చేసినట్లు రేణూ తెలిపారు. అయితే కొన్నాళ్లుగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ వచ్చిన రేణూ దేశాయ్ ఇప్పుడు స‌డెన్‌గా సన్యాసం గురించి చెప్పడం సినీ వర్గాలనూ, అభిమానులనూ ఆశ్చర్యపరుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :