Tuesday, 17 September 2024 12:34:52 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరేంటో తెలుసా? అప్పుడు పుట్టాడని..

Date : 22 July 2024 11:53 AM Views : 42

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. సరికొత్త కథ, కథనంతో కొత్త ఆలోచనలతో వచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి ఈ జనరేషన్ కి బాగా దగ్గరయ్యాడు. అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి పాన్ ఇండియా భారీ హిట్ కొట్టాడు సందీప్. తనకంటూ ఫిలిం మేకింగ్ సపరేట్ స్టైల్ సృష్టించుకొని చేసిన మూడు సినిమాలతోనే అభిమానులని సంపాదించుకొని తన తర్వాత సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు సందీప్. సందీప్ వంగ త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సందీప్ వంగకు పెళ్లి అయి ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ బాబు పేరేంటో తెలుసా?గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అందుకే వాడి పేరు అర్జున్ రెడ్డి అని పెట్టాను. అర్జున్ అనే పేరు నాకు ఇష్టం. ఆ పేరులో ఏదో షార్ప్ నెస్ ఉంటుంది. అందుకే సినిమాకు, నా కొడుక్కి కూడా అదే పేరు పెట్టుకున్నాను అని తెలిపారు. కొంతమంది సినిమా వాళ్ళు తమకు కలిసొచ్చిన సినిమాలని సెంటిమెంట్ గా మార్చుకొని ఇలా పేర్లు పెట్టుకుంటారని తెలిసిందే. అలాగే అర్జున్ రెడ్డి షూటింగ్ చేసేటప్పుడు పుట్టాడని తన కొడుక్కి అర్జున్ రెడ్డి పేరు పెట్టడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :