Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : National Award Actress: అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతాయని తెలిసిందే. తాజాగా నేషనల్ అవార్డు గెలుచుకున్న నటి చిన్నప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నిన్న 70వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు సాధించిన నటి చిన్నప్పటి ఫోటో ఇది. 70వ నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటిగా తిరుచిత్రంబళం సినిమాకు గాను నటి నిత్యామీనన్ కు అవార్డు వరించింది. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు నిత్య మీనన్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇదే సమయంలో నిత్య మీనన్ చిన్నప్పటి క్యూట్ ఫోటో వైరల్ గా మారింది. ఎందుకంటే నిత్య మీనన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యామీనన్ మలయాళంలో ఆకాశ గోపురం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో నిత్య మీనన్ కు బాగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నిత్య మీనన్ అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేస్తూ బిజీగానే ఉంది. నిత్య మీనన్ సింగర్ కూడా. ఇప్పటికే పలు భాషల్లో అనేక పాటలు పాడింది.
Admin
Studio18 News