Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కల్కితో 1000 కోట్ల హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో రాజాసాబ్ తో రానున్నాడు. ప్రభాస్ సినిమాల పరంగా అభిమానులు హ్యాపీగా ఉన్నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని బాధపడుతున్నారు. 40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి గురించి మాట్లాడితే తర్వాత చూద్దాం అంటాడు ప్రభాస్. అయితే ప్రభాస్ కి కూడా క్రష్ లు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చిన్నప్పట్నుంచి పలు హీరోయిన్స్ పేర్లు తన క్రష్ అని చెప్పాడు. అయితే ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? గతంలో బాహుబలి సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప్రభాస్ ఈ విషయాన్ని తెలిపాడు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన మొదటి క్రష్ గురించి తెలిపారు.ప్రభాస్ ని తన మొదటి క్రష్ ఎవరు అని అడగ్గా.. మొదట ఎవరు లేరని చెప్పినా ఆ తర్వాత చిన్నప్పుడు స్కూల్ లో ఇక టీచర్ ఉండేదని, తన పేరు యామవల్లి అని తెలిపాడు. చెన్నైలో డాన్ బాస్కో స్కూల్ లో చదివినప్పుడు మా స్కూల్ టీచర్ నా ఫస్ట్ క్రష్ అని తెలిపాడు ప్రభాస్. గతంలో చెప్పినా ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది.
Admin
Studio18 News