Monday, 19 January 2026 08:11:35 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Allu Arjun: పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్..

Date : 02 September 2024 02:09 PM Views : 274

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం హైలైట్ గా మారింది. గత కొంతకాలంగా ఇరువురు హీరోల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలే దీనికి కారణం. ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇటీవల పొసగడంలేదు. అల్లు అర్జున్ పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనికితోడు ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మరింత పెరిగింది. హీరోల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :