Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Citadel streaming date : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ రూపు దిద్దుకుంటోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఇది శుభవార్త. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు రాజ్ అండ్ డీకే ప్రకటించారు. అంతేకాదండోయ్.. టీజర్ సైతం విడుదల చేశారు. హిందీతో పాటు, భారతీయ భాషల్లో ఈ సిరీస్‌కు అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి డూప్‌లు లేకుండా సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించిందట.
Admin
Studio18 News