Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arjun – Nikhil Advani : ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనుకునే వాళ్ళు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో క్లాసిక్ సినిమాలు బాలీవుడ్ అందించింది. కానీ కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత బాలీవుడ్ పరాజయాల పాలైంది. బాలీవుడ్ లో ఒకటి రెండు తప్ప వచ్చిన సినిమా వచ్చినట్టు స్టార్ హీరోల సినిమాలతో సహా ఫ్లాప్స్ అయ్యాయి. చాలా సినిమాలకు పెట్టిన బడ్జెట్లు కూడా రాలేదు. ఒకానొక దశలో అయ్యో పాపం బాలీవుడ్ కూడా అనుకున్నారు. అదే టైంలో మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వరుస హిట్లు కొట్టడంతో బాలీవుడ్ సినిమాలకు మరింత దెబ్బ పడింది. దీంతో బాలీవుడ్ పై సౌత్, నార్త్ అన్ని పరిశ్రమల ప్రముఖులు కామెంట్లు చేశారు. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలను తెలిపాడు. డైరెక్టర్ నిఖిల్ అద్వానీ జాన్ అబ్రహంతో తెరకెక్కించిన వేద సినిమా ఆగస్టు 15 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అల్లుఅర్జున్ ప్రస్తావన గురించి రాగా నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. గతంలో అల్లు అర్జున్ తో నేనొక సినిమా చేయాలని అతన్ని కలిసాను. అప్పుడు ఆయన బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ బాలీవుడ్ పరిస్థితిపై నిరాశ వ్యక్తపరిచారు. బాలీవుడ్ కి ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీకు తెలుసు కానీ మీరెందుకు మర్చిపోయారు అని అడిగారు. ఆయన అడిగింది కూడా నిజమే. సౌత్ సినిమాల్లో హీరోయిజం తో పాటు అందులోని ఎమోషన్స్ ని బాగా చూపిస్తారు. బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో ఆ ఎమోషన్ తగ్గింది అని అన్నారు. దీంతో డైరెక్టర్ నిఖిల్ అద్వానీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News