Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఫుల్ మాస్ కమర్షియల్ గా కొరటాల శివ దర్శకత్వంలో భారీగా రెండు పార్టులతో దేవర సినిమా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది దేవర సినిమా. ఇక దేవర సినిమా నుంచి ఇప్పటికే ఓ మాస్ గ్లింప్స్, మాస్ సాంగ్ రిలీజ్ చేయగా ఆగస్టు 5న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ మ్యూజిక్ ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఎన్టీఆర్, జాన్వీ ఉన్న ఓ కొత్త పోస్టర్ కి ఈ మ్యూజిక్ జత చేసి షేర్ చేసారు. ఈ మ్యూజిక్ వింటుంటే సాంగ్ రొమాంటిక్ మెలోడీగా అదిరిపోతుంది తెలుస్తుంది. ఇక ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. దీంతో ఫ్యాన్స్ ఈ రొమాంటిక్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
Admin
Studio18 News