Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Krishna Shroff : ఇటీవల బాలీవుడ్ లో వారసులు, వారసురాళ్లు అందరూ సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ నటీనటుల కూతుళ్లు, కొడుకులు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు జాకీ ష్రాఫ్. తెలుగులో కూడా పంజా, శక్తి, సాహోతో పాటు పలు సినిమాల్లో నటించాడు. జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఆల్రెడీ బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూకుసుకుపోతున్నాడు.అయితే ఇప్పుడు జాకీ ష్రాఫ్ కూతురు, టైగర్ ష్రాఫ్ చెల్లి కృష్ణ ష్రాఫ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే కృష్ణ ష్రాఫ్ బిజినెస్ చేస్తూ, టీవీలో పలు షోలలో కనిపించి పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో ఇప్పటికే బోల్డంతమంది ఫాలోవర్స్ ని సాధించింది. కృష్ణ ష్రాఫ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. అలాగే ఫిట్నెస్, జిమ్ కి సంబంధించిన బిజినెస్ లు చేస్తుంది. ఇప్పటికే పలు బిజినెస్ అవార్డులు కూడా అందుకుంది కృష్ణ.
Admin
Studio18 News