Monday, 19 January 2026 08:02:46 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Rajinikanth: హేమ కమిటీ రిపోర్టుపై రజనీకాంత్ ఏమన్నారంటే..!

Date : 02 September 2024 02:02 PM Views : 245

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపులకు కారణమైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఆ కమిటీ గురించి కానీ, అది ఇచ్చిన నివేదిక గురించి కానీ తనకేమీ తెలియదని జవాబిచ్చారు. ఆదివారం తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ క్రమంలోనే జస్టిస్ హేమీ కమిటీ రిపోర్టుపై మీరెలా స్పందిస్తారంటూ ఓ విలేకరి అడగగా.. రజనీకాంత్ కాస్త కన్ఫూజన్ కు లోనయ్యారు. ప్రశ్న అర్థంకాలేదని, మరోసారి అడగాలని కోరారు. దీంతో సదరు విలేకరి మరోసారి హేమ కమిటీ రిపోర్టును ప్రస్తావించగా.. ఆ కమిటీ ఏం రిపోర్టు ఇచ్చిందో, మలయాళ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకేమీ తెలియదని రజనీకాంత్ జవాబిచ్చారు. కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, లింగ వివక్ష, పారితోషికంలో వ్యత్యాసాలు, కనీస సౌకర్యాల కొరత.. తదితర అంశాలపై జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్టు తయారు చేసి కేరళ సర్కారుకు ఇటీవల అందజేసింది. ఈ నివేదిక బయట పెట్టడంతో చాలామంది మహిళా యాక్టర్లు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టారు. నటుడు జయసూర్యతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. పలువురు నటీమణులు ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్యానెల్ సభ్యులపైనా ఆరోపణలు చేశారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ 'అమ్మ' ప్రెసిడెంట్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్యానెల్ లోని 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. దీనిపై మోహన్ లాల్ స్పందిస్తూ.. అమ్మ ప్రెసిడెంట్ గా తాను రెండుసార్లు బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుకు కేవలం ‘అమ్మ’ మాత్రమే కాదు మలయాళం ఇండస్ట్రీ మొత్తం జవాబు చెప్పాలన్నారు. వేధింపులకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలని తేల్చిచెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :