Monday, 08 December 2025 04:23:43 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్..

Date : 22 July 2024 04:15 PM Views : 248

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఆపరేషన్ రావణ్ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్ కుమార్, రఘు కుంచె.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా డైరెక్టర్ వెంకట సత్య తాజాగా మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు వెంకట సత్య సినిమా గురించి మాట్లాడుతూ.. మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. జరిగే పనులకు కారణమైన ఆలోచనలను మేము విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసినా, కరెక్ట్ చేసినా దానికి ఆ మనిషి ఆలోచనలే కారణం. మనం ఏ పని చేసినా ముందు ఆలోచనల్లో చేయాలా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ఈ సినిమా తీసాను. సరిగ్గా చూస్తే రామాయణం కూడా థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఆపరేషన్ రావణ్ లో రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చినట్టు మా సినిమాలో మాస్క్ పెట్టుకుని వస్తాడు. అందుకే ఈ సినిమాకు ‘ఆపరేషన్ రావణ్’ టైటిల్ పెట్టాం అని తెలిపారు.అలాగే సినిమాలో.. ఒక సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని, అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అని చూపిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఆగస్టు 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ మార్చుకొని జులై 26కి వస్తున్నాం అని చెప్పారు. ఇక రక్షిత్ అట్లూరి సూపర్ హిట్ సినిమా పలాసకు సీక్వెల్ కూడా అంటుందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ రావణ్ సినిమాలో సినిమా మొదలయిన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము. అలా వెయ్యి మందికి సిల్వర్ కాయిన్స్ ఇస్తాము అని బంపర్ ఆఫర్ ఇచ్చారు డైరెక్టర్ వెంకట సత్య.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :