Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vivek Athreya – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ హీరోకి లేనంత మంది కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కొనసాగుతుంది. సినీ పరిశ్రమలోని చాలా మంది స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. తాజాగా సరిపోదా శనివారం సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. గుడుంబా శంకర్, బాలు సినిమాలకు గుంటూరు చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హవానే. ప్యాంట్స్ మీద ప్యాంట్స్ వేసుకొని రచ్చ చేసారు. అది పవన్ కళ్యాణ్ గారి పీక్ స్టేజ్. ఖుషి తర్వాత జానీ తర్వాత వెంటనే గుడుంబా శంకర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కి అప్పట్లోనే మ్యాడ్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అందరూ షర్ట్ మీద షర్ట్ వేసి, ప్యాంట్ మీద ప్యాంట్ వేసి హడావిడి చేసారు. గుడుంబా శంకర్ ఆడియో పెద్ద హిట్ అయింది. దీంతో గుడుంబా శంకర్ సినిమా సమయంలో గుంటూరులో ఒక జాతరలా ఉండేది ఫ్యాన్స్ తో అని అన్నారు. దీంతో వివేక్ చేసిన వ్యాఖ్యలను పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉండేది అని కామెంట్స్ చేస్తున్నారు.
Admin
Studio18 News