Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Squid Game 2 : నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 2021లో కొరియన్‌లో వచ్చిన స్క్విడ్ గేమ్ సిరీస్ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ స్థాయిని పెంచింది. తక్కువ బడ్జెట్ తో చిన్న సిరీస్‌లా తయారయి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రపంచమంతటా అనుకోకుండా భారీ విజయం సాధించింది. స్క్విడ్ గేమ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2 కూడా గతంలోనే ప్రకటించారు. స్క్విడ్ గేమ్ సీజన్ 1లో మనం చిన్నప్పుడు ఆడుకునే ఓ గేమ్ కి శిక్షలు, బహుమతులు, డేంజర్ రూల్స్ పెట్టి, ఆట మధ్యలో ఎమోషన్స్ తో ప్రేక్షకులని మెప్పించారు. ఇప్పుడు సీజన్ 2 కూడా అదే గేమ్ తో మరింత థ్రిల్లింగ్ గా, ఎమోషన్ గా ఉండబోతుంది. తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్ 26న రిలీజ్ కాబోతుంది. అలాగే సీజన్ 3 కూడా అనౌన్స్ చేయడం విశేషం, సీజన్ 3 వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీంతో స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఆ సిరీస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Admin
Studio18 News