Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arjun – Balakrishna : నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు అవుతుండటంతో ఓ పక్క అభిమానులు సెలబ్రేషన్స్ చేయడానికి సిద్దమవుతుండగా మరో పక్క తెలుగు సినీ పరిశ్రమ అధికారికంగా బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని పలు యూనియన్లు కలిసి హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని నిర్వహించబోతున్నారు. సెప్టెంబరు 1న నోవాటెల్ హోటల్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్స్ తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం లోని స్టార్స్ ని కూడా పిలుస్తున్నారు. ఈ వేడుకలకు స్టార్ నటీనటులు రాబోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి.. ఇలా అనేక మంది స్టార్స్ వస్తున్నారని తెలియడంతో ఇంతమంది ఒకే వేదికపై కనపడబోతున్నారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలయ్య వేడుకలకు రాబోతున్నాడు. ఇటీవల పలుమార్లు బాలయ్య – అల్లు అర్జున్ కలిసి షోలు, ఈవెంట్స్ లో కనపడి అలరించిన సంగతి తెలిసిందే. నేడు అల్లు అర్జున్ ని తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ, మా అసోసియేషన్ సభ్యులు.. ఇలా అన్ని యూనియన్స్ నుంచి ప్రముఖులు వెళ్ళి ఆహ్వానించారు. అల్లు అర్జున్ ఈవెంట్ కి వస్తానని చెప్పినట్లు తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హవా చూస్తుంటే బాలకృష్ణ ఈవెంట్ కి అన్ని పరిశ్రమల స్టార్స్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నట్టు అర్ధమవుతుంది.
Admin
Studio18 News