Sunday, 08 February 2026 10:39:46 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Nayanthara: నయనతార మందారపువ్వు టీపై వైద్యుడి ఫైర్.. దీటుగా నయన్ సమాధానం

Date : 30 July 2024 03:52 PM Views : 380

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మందారపువ్వు టీ తాగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రముఖ నటి నయనతారపై ఓ వైద్యుడు విరుచుకు పడ్డాడు. ఆ వైద్యుడు మరెవరో కాదు.. ఇటీవల సమంతను విమర్శించిన డాక్టరే. ‘ది లివర్ డాక్టర్’ అనే ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. మందారపువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సమంత తన ఫాలోవర్లను తప్పుదారి పట్టించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నయనతార ఆ పని చేస్తోందని మండిపడ్డారు. మందారపువ్వు టీ బాగుంటుందని చెప్పి వదిలేసి ఉంటే అయిపోయేదని, కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పి తన మిడిమిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారని ఫైరయ్యారు. మందారపువ్వు డయాబెటిస్, హైబీపీ, యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ నయనతార చెబుతున్నారని, ఆమె చెప్పిన వాటికి ప్రూఫ్స్ లేవని పేర్కొంటూ, నయనతార పోస్టు ఫొటోలను షేర్ చేశారు. ఇంతకీ నయన్ ఏమని చెప్పారంటే.. ‘‘మందారపువ్వు టీ నాకు చాలా ఇష్టం. ఇది ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. దీనిని ఆయుర్వేదంలోనూ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి మొటిమలను నివారిస్తుంది. మందారంలో విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్, అనారోగ్యం నుంచి రక్షించే యాంటీ బ్యాక్టీరియల్ ఇది. కాబట్టి ఈ టీ తాగండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి’’ అని నయనతార సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తెలివి తక్కువ వారితో వాదించవద్దు వైద్యుడి విమర్శలపై స్పందించిన నయనతార.. తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు.. అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన సూక్తిని షేర్ చేసింది. అయితే, ఇందులో నేరుగా వైద్యుడిని ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించే నయన్ ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :