Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allari Naresh : వరుస కామెడీ సినిమాలతో మెప్పించిన అల్లరి నరేశ్ నాంది సినిమా నుంచి తన స్టైల్ మార్చి సీరియస్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రాగా త్వరలో బచ్చలమల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా నేడు సైలెంట్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లరి నరేష్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. డైరెక్టర్ మెహర్ తేజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రుహాణి శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న అల్లరి నరేష్ ఈ సారి ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.
Admin
Studio18 News