Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Naga Manikanta – Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి రోజు నుంచే గొడవలు, ఏడుపులతో సాగుతుంది. అయితే ఈసారి ఎక్కువ పాపులర్ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నా అసలు ఎవ్వరికి పరిచయంలేని నాగమణికంఠ అనే నటుడు కూడా హౌస్ లోకి వచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న నాగ మణికంఠ హౌస్ లోకి వచ్చినప్పుడు ఎవ్వరికి తెలీదు. కానీ హౌస్ లో నాగ మణికంఠ చేసే రచ్చ చూసి ఇప్పుడు అందరికంటే పాపులర్ అయిపోయాడు. ఎప్పుడూ ఏడుస్తూ, ఎవ్వరితో కలవకుండా, ఒంటరిగా కూర్చుంటూ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు నాగమణికంఠ. నామినేషన్స్ సమయంలో ఏడ్చి తన బాధలు, తన కుటుంబం పరిస్థితి చెప్పి వైరల్ అయ్యాడు. అయితే ఇప్పుడు నాగమణికంటకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది. నాగమణికంఠ నిన్నటి ఎపిసోడ్ లో పక్కనున్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఏడుస్తూ తన తలపై ఉన్న విగ్ తీసేసాడు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఇన్నాళ్లు సూపర్ ఉంది హెయిర్ స్టైల్ అనుకున్నది విగ్గా అని ఆశ్చర్యపోతున్నారు బిగ్ బాస్ వ్యూయర్స్. ఇక ట్రోలర్స్ దీనిపై ట్రోల్స్ చేస్తూ పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చావుగా అంటూ కామెంట్స్ చేస్తుంటే పలువురు మాత్రం ఇది అతని పర్సనల్ దాంట్లో తప్పేముంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
Admin
Studio18 News