Sunday, 08 March 2026 10:24:36 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Comedian Sudhakar : నా చివరి సినిమా అదే.. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను..

Date : 11 August 2024 01:12 PM Views : 216

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ ఒకప్పుడు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని నవ్వించాడు. చిరంజీవితో పాటే సినీ పరిశ్రమలోకి వచ్చిన సుధాకర్ 1980 నుంచి తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసారు. చిరంజీవి, సుధాకర్ కెరీర్ మొదట్లో ఒకే రూమ్మేట్స్ అవ్వడంతో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సుధాకర్ నటుడి గానే కాక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే గత కొన్నేళ్లుగా సుధాకర్ అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలోలాగా కాకుండా అనారోగ్యంతో బలహీన పడటంతో సుధాకర్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల తన కొడుకు బెన్ని కూడా నటుడు అవ్వడంతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సుధాకర్. తాజాగా సుధాకర్ తన కొడుకు బెన్నితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలు ఎందుకు ఆపేశాడో తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ.. వెంకటేష్ సంక్రాంతి నా లాస్ట్ సినిమా. దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను. ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు సినిమాలు చేయలేను. నా కొడుకు నా లోటుని భర్తీ చేయాలను అనుకుంటున్నాను అని తెలిపారు. అయితే సుధాకర్ తనయుడు బెన్ని మాత్రం.. నాన్న ఏజ్ కి తగ్గట్టు ఏదైనా పాత్రలు వస్తే చేపించాలని అనుకుంటున్నాను అని తెలిపాడు. సుధాకర్ సంక్రాంతి సినిమాలో చివరగా నటించినా అతను నటించిన మరి కొన్ని సినిమాలు ఆ తర్వాత కూడా రిలీజ్ అయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :