Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nag Ashwin : ఇటీవలే ప్రభాస్ తో కల్కి సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు నాగ్ అశ్విన్. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ సినిమా మంచి విజయం సాధించింది. కల్కి సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కల్కి 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కల్కి 2 సినిమా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలవుతుందని, 2025 లోనే సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వినీదత్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కల్కి 2 సినిమా ఇప్పట్లో రాదా అనే సందేహాలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇది నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా తెలియాలి. ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై నాగ్ అశ్వినే క్లారిటీ ఇవ్వాలి.
Admin
Studio18 News