Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయిక కాగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగులు చేసారు. అటు ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. యూకేలోని పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్‌లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్లు దక్కించుకున్న ఫ్యాన్స్.. ఫస్ట్ షో టికెట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర బెనిఫిట్ షోకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. అభిమానుల కోసం సెప్టెంబర్ 27న తెల్లవారుజామున 1.08 గంటలకు బెన్‌ఫిట్ షో వేసేలా చిత్ర బృందం సన్నాహకాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సమయంలో బెన్‌ఫిట్ షో వేయనున్నారట. ఇందుకు సంబంధించిన విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రెండు లిరికల్ సాంగ్స్ సైతం రికార్డు వ్యూస్ సాధించాయి.
Admin
Studio18 News