Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో తొలివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఇంటి సభ్యుల అరుపులు, గొడవలు, ఏడుపులతో నామినేషన్ల పర్వం కొనసాగింది. ఫస్ట్ వీక్‌లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఎమోషనల్ అయిన మణికఠ.. నటుడు మణికంఠ మొదటి రోజు నుంచి ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. షో ప్రారంభ రోజే ప్రాంక్ చేయగా బాధ, కోపం రెండూ వెల్లగక్కాడు. తన కష్టాలు చెబుతూ వస్తున్నాడు. ఇక నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సింపతీ గేమ్ ఆడుతున్నాడని అంటూ పృథ్వీరాజ్ సహా మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యాడు. దీంతో ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానేమేనని భయంతో ఏడ్చేశాడు. తాను ఎలిమినేట్ అవుతాననే భయం వేస్తోందని, ఎలా ఉండాలో అర్ధం కావడం లేదని నామినేషన్ల ప్రక్రియ తరువాత మణికంఠ చెబుతూ ఏడ్చేశాడు. జీవితంలో తనకు ఇదే చివరి యుద్ధం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని నిఖిల్ ఓదార్చాడు. ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. ఆ తరువాత బిగ్‌బాస్ అతడిని పిలిచాడు. ఆ సమయంలోనూ ఎమోషనల్ అయ్యాడు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలనే ఆశలతో హౌస్‌లోకి వచ్చానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని చెప్పుకొచ్చాడు. ‘నా భార్య నాకు కావాలి. నా అత్తమామల నుంచి గౌరవం కావాలి. నా స్టెప్ ఫాదర్ మళ్లీ కావాలి. నా కూతరు నాకు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా బయటపడిపోతానని అనుకోలేదు. చాలా నిలకడగా ఉంటానని అనుకున్నా. లుక్స్‌తో మెయింటెన్ చేద్దామనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావడం లేదు.’ అంటూ ఏడ్చేశాడు. బిగ్‌బాస్ అతడికి ధైర్యం చెప్పి పంపించి వేశాడు. నామినేషన్‌లో ఉన్నది వీళ్లే.. తొలి వారం నామినేషన్లలో బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నాగ మణికంఠ, శేఖర్ బాషా, యాంకర్ విష్ణుప్రియలు నామినేషన్‌లో ఉన్నారు. బుధవారం రాత్రి ఎపిసోడ్ ముగిసిన తరువాత నుంచి ఓటింట్ పోల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ ఆరుగురిలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో ఆదివారం సదరు ఇంటి సభ్యుడు ఎలిమినేట్ కానున్నాడు.
Admin
Studio18 News