Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అలాగే ఇదే కాంబోలో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం కూడా దేవరపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు మేకర్స్ మూవీ నుంచి అప్‌డేట్ ఉంటుందని ప్రకటించారు. భైరవకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తామంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, సినిమాలో తారక్ సరసన కథనాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించాడు.
Admin
Studio18 News