Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Dr Rajasekhar : ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ జీహెచ్ఎంసీ పరిధిలోని జుబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 70లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. ఇక్కడి అశ్వినీ హైట్స్ నుంచి డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్లుగానో వేధిస్తోందని తెలిపారు. దీని గురించి జీహెచ్ఎంసీకి ఎప్పుడో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫోటోను పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌లను ట్యాగ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా రాజశేఖర్ ఎక్స్‌ట్రార్డినరి సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
Admin
Studio18 News