Sunday, 08 March 2026 04:30:39 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Sneha – Pawan Kalyan : రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పవన్ పై స్నేహ వ్యాఖ్యలు..

Date : 03 September 2024 11:03 AM Views : 267

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sneha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి పొగడని వాళ్ళు ఎవరుంటారు. ఆయనతో పనిచేసే వాళ్లే కాదు ఆయన మంచితనం, నిజాయితీ, ప్రజల కోసం పడే తపన చూసి ఎవరైనా ఆయన్ని పొగుడుతారు. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ ప్రముఖులు పవన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. నిన్న రాత్రి GOAT సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విజయ్ తప్ప మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సినిమాలో స్నేహ కూడా నటించింది. ఈవెంట్లో స్నేహ మాట్లాడుతుండగా మీరు పనిచేసిన సినిమా వాళ్ళల్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎవరు అని యాంకర్ అడిగింది. స్నేహ మాట్లాడుతూ.. తెలుగులో ఆల్మోస్ట్ అందరితో పనిచేసాను ఒక ఇద్దరితో తప్ప. మెగాస్టార్ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయలేకపోయాను. అందుకు నేను ఎప్పుడూ బాధపడతాను. ఇవాళ పవన్ గారి బర్త్ డే, హ్యాపీ బర్త్ డే విషెష్ ఆయనకు. ఆల్ టైం గ్రేటెస్ట్ పవన్ గారే. ఎందుకంటే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆయన పవర్ స్టారే అని అన్నారు. దీంతో స్నేహ చేసిన వ్యాఖ్యలని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. పవన్ తో పనిచేయకపోయినా ఆయన గురించి గొప్పగా చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :