Sunday, 08 March 2026 10:56:05 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Vettaiyan: రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ వేట్టైయాన్ విడుదల తేదీ వచ్చేసింది

Date : 19 August 2024 01:56 PM Views : 686

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సూపర్ స్టార్ రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్’ విడుదల తేదీ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టి.జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించాడు. రోబో 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి సినిమాల తర్వాత రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జనీకాంత్- రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. వేట్టైయాన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజనీ- అమితాబ్ క‌లిసి న‌టించిన నాలుగో సినిమా ఇది. మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికాసింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :