Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mr Bachchan ott release : మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త ఇది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది నెట్‌ఫ్లిక్స్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. కథ : ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో ఆనంద్ బచ్చన్ (రవితేజ) పని చేస్తుంటాడు. అతడు ఓ సిన్సియర్ ఆఫీసర్. పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి నల్లధనాన్ని పట్టుకుంటాడు. అయితే.. సదరు వ్యక్తిని, అతడిని సపోర్ట్ చేసిన సీనియర్ ఆఫీసర్‌ని అవమానించడంతో ఉద్యోగం కోల్పోతాడు. దీంతో తన సొంతూరు వచ్చి ఆర్కెస్ట్రా నడుపుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కితో(భాగ్యశ్రీ బోర్సే) ప్రేమలో పడతాడు. వీరిద్దరు పెళ్లికి సిద్ధమవుతుండగా ఆనంద్‌కు ఉద్యోగం తిరిగి వస్తోంది. ఎంపీ ముత్యం జగ్గయ్య ఇంట్లో రైడ్ చేయమని అతడికి ఆదేశాలు వస్తాయి. మరో నాలుగు రోజుల్లో పెళ్లి అనగా ఎంపీ ఇంటికి రైడ్‌కు వెళతాడు. రైడ్ లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అక్కడ నల్లధనం దొరికిందా? జిక్కి తో బచ్చన్ పెళ్లి అయిందా? అసలు ఈ బచ్చన్ పేరు వెనుక ఉన్న కథేంటి తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
Admin
Studio18 News