Thursday, 12 March 2026 03:35:21 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Raj Tarun – Malvi Mlahotra : రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా బయటకి వస్తారు.. ప్రెస్ మీట్ పెడుతున్నాం..

Date : 30 July 2024 03:45 PM Views : 350

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raj Tarun – Malvi Mlahotra : ఇటీవల గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని, నాతో పదేళ్లు ప్రేమలో ఉండి, అబార్షన్ చేయించి ఇప్పుడు వదిలించుకుందామని చూస్తున్నాడు, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై కేసు పెట్టింది. దీంతో రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టింది. ఈ వివాదం మొదలయినప్పటి నుంచి రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా అసలు మీడియా ముందుకు రావట్లేదు. ఇటీవలే జులై 26న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ మరో సినిమా రిలీజ్ కాబోతుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రావట్లేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత మల్కపురం శివ మీడియాతో మాట్లాడగా అందరూ ఈ సినిమాకి కూడా రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కి రాడా? హీరోయిన్ కూడా రాదా? అని అడిగారు. దీనికి నిర్మాత మల్కపురం శివ మాట్లాడుతూ.. అందరూ వస్తారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా ప్రమోషన్స్ కి వస్తారు. రేపు లేదా ఎల్లుండి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. ఆ ప్రెస్ మీట్ కి హీరోతో సహా అందరూ వస్తారు అని తెలిపారు. మరి రాజ్ తరుణ్ నిజంగానే బయటకి వచ్చి ప్రెస్ మీట్ కి వస్తారా? ప్రెస్ మీట్ కి వస్తే మీడియాని ఫేస్ చేస్తారా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :