Monday, 08 December 2025 03:47:55 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Wayanad landslides : లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో వయనాడ్‌ సహాయక చర్యల్లో మోహన్‌లాల్‌..

Date : 03 August 2024 01:02 PM Views : 167

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mohanlal : కేర‌ళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్‌లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌నలో ఎంతో మంది మృతి చెంద‌డం యావ‌త్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల‌కు సాయం చేసేందుకు హీరో మోహ‌న్‌లాల్ ముందుకు వ‌చ్చారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహ‌న్‌లాల్ శ‌నివారం ఆర్మీ యూనిఫాం ధ‌రించి వయ‌నాడ్‌కు చేరుకున్నారు. మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆస్ప‌త్రిలోచికిత్స పొందుతున్న బాధితుల‌ను మోహ‌న్ లాల్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కేర‌ళ సీఎం స‌హాయ‌నిధికి రూ.25ల‌క్ష‌లు విరాళంగా అందించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్ర‌భుత్వ అధికారుల కృషిని ఆయ‌న ప్ర‌శంసించారు. మరోవైపు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. డ్రోన్లు, రాడార్లు, మొబైల్‌ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంకా వందలాది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :