Sunday, 08 March 2026 03:40:26 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Pushpa 2: The Rule: పుష్ప-2కు అక్టోబరే డెడ్‌లైన్‌!

Date : 14 September 2024 04:38 PM Views : 324

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లు అర్జున్‌. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా అ్లలు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ వస్తోంది. మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాడానికి ప్లాన్‌ చేశారు. అయితే చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు బ్యాలెన్స్‌ ఉండటంతో మేకర్స్‌ డిసెంబరు 6కు వాయిదా వేశారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు, టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన చిత్రంపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే డిసెంబరు 6న విడుదల లక్ష్యంగా ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. చిత్రంలోని ముఖ్యతారలంతా పాల్గొంటున్న కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇవి ఈ చిత్రంలో మేజర్‌ హైలైట్‌గా ఉంటాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్‌ను వచ్చే నెల 15లోగా పూర్తిచేయాలని దర్శక, నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా అక్టోబర్‌ 15 నాటికి చిత్రీకరణ పూర్తవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇక అక్టోబరు మూడో వారం నుంచి ప్రమోషన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :