Saturday, 24 January 2026 02:23:53 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Viraaji : ఆడియన్స్ అట్రాక్షన్ కోసం వరుణ్ సందేశ్‌కి ఆ గెటప్ వేయలేదు.. విరాజి సినిమాపై నిర్మాత..

Date : 26 July 2024 10:20 AM Views : 234

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Viraaji Producer Mahendra Nath : వరుణ్ సందేశ్ ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నింద సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. త్వరలో ‘విరాజి’ సినిమాతో రాబోతున్నాడు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా విరాజి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత మహేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. నిర్మాత మహేంద్ర నాథ్ సినిమా గురించి మాట్లాడుతూ.. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా తర్వాత మా సంస్థలో రాబోతున్న రెండో సినిమా విరాజి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హారర్ అంశాలు జతచేసి విరాజి సినిమాను నిర్మించాం. హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి వరుణ్ సందేశ్ తోనే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఇంకా రఘు, ప్రమోదిని.. లాంటి పలువురు ఆర్టిస్టులు ఉన్నారు. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకు అలా ఉంది అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఏదో ఆడియన్స్ అట్రాక్షన్ కోసం ఆ గెటప్ వేయించలేదు. సినిమాలోని పాత్రకు అది సరిపోతుంది అని తెలిపారు.అలాగే.. మా ఫ్రెండ్ సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ బాగా నేరేట్ చేసారు. చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించాడు. అతనికి ఇదే ఫస్ట్ సినిమా. అంతకుముందు కూడా ఎక్కడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయలేదు. ఇక వరుణ్ సందేశ్ కంటే ముందు ఇంకో ఇద్దరు, ముగ్గుర్ని అనుకున్నాము. నేను కొత్త నిర్మాతను కాబట్టి మాకు హీరోగా నటించి వెళ్లిపోయే వాళ్ళు కాకుండా సినిమా రిలిజ్ అయ్యేవరకు మాతో సినిమాని ప్రమోట్ చేసే హీరో కావాలి. అందుకే వరుణ్ సందేశ్ ని తీసుకున్నాం. అలాగే పాత్ర పరంగా కూడా వరుణ్ కి ఉన్న అమెరికన్ యాక్సెంట్ బాగా సూట్ అవుతుంది. వరుణ్ కూడా కొత్త గెటప్ కోసం బాగానే కష్టపడ్డాడు అని తెలిపారు. సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మేము నెల రోజుల ముందే ఆగస్టు 2 వస్తున్నాం అని చెప్పి రిలీజ్ చేస్తున్నాము. మిగిలిన సినిమాలన్నీ ఆ తర్వాతే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాయి. ప్రతివారం ఎన్ని సినిమాలు వచ్చినా కంటెంట్ ఉన్న సినిమాలే నిలబెడతాయి. విరాజిలో మంచి కంటెంట్ ఉంది. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూసి టెక్నికల్ గా కూడా బాగుందని అన్నారు. సెన్సార్ వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. సినిమాకు U/A ఇచ్చారు. కేవలం 100 నిమిషాల సినిమా. 100 థియేటర్స్ పైనే విరాజి సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు. ఇక నిర్మాత మహేంద్ర నాథ్ తీయబోయే తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా లవ్, కమర్షియల్ సినిమా తీస్తున్నాం. 50 శాతం షూట్ అయిపోయింది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :