Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kiran Abvbavaram : కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రాజావారు రాణిగారు సినిమా చేస్తున్నప్పుడే ఆ సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరి ఆ తర్వాత ప్రేమలో పడి ఐదేళ్లు ప్రేమించుకొని ఇటీవల మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం తన సినిమా ఈవెంట్లో ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించాడు. తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి. రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పూజలు చేస్తున్నారు. అలాగే సంగీత్ కి డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేసింది. దీంతో కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయినట్టు తెలుస్తుంది. కిరణ్, రహస్య పూజ చేస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. కిరణ్ అబ్బవరం పెళ్లి ఆగస్టులోనే అని చెప్పాడు కానీ ఇంకా డేట్ బయటకు చెప్పలేదు. పెళ్లి పనులు మొదలయ్యాయి కాబట్టి త్వరలోనే కిరణ్ – రహస్య పెళ్లి ఉండొచ్చని తెలుస్తుంది.
Admin
Studio18 News