Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sai Pallavi Dance : హీరోయిన్ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి తను ప్రేమించిన వ్యక్తి వినీత్ తో నేడు ఉదయం జరిగింది. కేవలం సన్నిహితులు, ఫ్యామిలీ మధ్య మాత్రమే ఈ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న హల్దీ, సంగీత్ వేడుకలు నిర్వహించగా నేడు ఉదయం పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి డ్యాన్స్ అదరగొట్టేసింది. పలుమార్లు తన చుట్టాలు, ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్సులు వేసింది. సంగీత్ లో తన చెల్లితో కలిసి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి పల్లవి బామ్మతో కలిసి కూడా డ్యాన్స్ వేసింది. దీంతో ఈ డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. సాధారణంగానే సాయి పల్లవి మంచి డ్యాన్సర్ అని అందరికి తెలిసిందే. గతంలో చెల్లి ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా డ్యాన్స్ వేసిన సాయి పల్లవి ఇప్పుడు పెళ్లి వేడుకల్లో కూడా డ్యాన్సులు అదరగొట్టేసింది. మీరు కూడా చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు చూసేయండి..
Admin
Studio18 News