Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nani – Allu Arjun : ఇటీవల జరిగిన సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ లో తెలుగులో నానికి దసరా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. దీంతో ఇది మూడోసారి నాని ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం. దీంతో నానికి అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. నాని ఫిలింఫేర్ అవార్డుతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నాని షేర్ చేసిన ఫోటోకి అల్లు అర్జున్ కామెంట్స్ చేస్తూ.. కంగ్రాట్స్. దీనికి నువ్వు అర్హుడివి అని పోస్ట్ చేసాడు. దీనికి నాని రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ బన్నీ. నేను కచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ ఇయర్ పుష్ప రూల్ తో నువ్వు చాలా అవార్డులు ఇంటికి తీసుకెళ్తావు అని పోస్ట్ చేసాడు. దీంతో బన్నీ అభిమానులు నాని కామెంట్ షేర్ చేస్తూ అభినందిస్తున్నారు.
Admin
Studio18 News