Sunday, 08 March 2026 04:46:38 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Raj Tarun : నన్ను ఆ వివాదం మళ్ళీ లాగొద్దు.. రియల్ లైఫ్‌లో పెళ్లి పై రాజ్ తరుణ్ కామెంట్స్..

Date : 27 August 2024 04:00 PM Views : 232

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raj Tarun : ఇటీవల రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయి చేసిన ఆరోపణలతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఈ వివాదంలో నిలిచాడు రాజ్ తరుణ్. అయితే ఈ వివాదం ఉన్నా తన సినిమాల ప్రమోషన్స్ తాను చేసుకుంటున్నాడు. గత నెలలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ సెప్టెంబర్ లో ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో రాబోతున్నాడు . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరగ్గా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ మీడియా ప్రతినిధి ఇటీవల జరిగిన వివాదం నుంచి బయటకు వచ్చినట్లున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగ్గా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి బాగున్నాను. ఆ వివాదం నుంచి బయటకు వచ్చానని మీరే అన్నారుగా మళ్ళీ నన్ను ఆ వివాదంలోకి లాగొద్దు. దాని వల్ల నా గత సినిమాలు సరిగ్గా ప్రమోట్ చేయలేదని బాధ పడ్డాను అని అన్నారు. అయితే ఆ వివాదం సడెన్ గా ఆగిపోయింది ఏం చేసారు అని అడగ్గా నేనేం చేయలేదు అని తెలిపాడు రాజ్ తరుణ్. అలాగే పెళ్లి వివాదంలో ఉన్నారు, సోషల్ మీడియాలో కూడా మీ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. మీరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటారా అని ఓ లేడీ మీడియా ప్రతినిధి అడగ్గా రాజ్ తరుణ్.. దాని గురించి చెప్పను సిస్టర్ అని తెలిపాడు. దీంతో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :