Thursday, 12 March 2026 04:25:21 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kalki Vs RRR : నార్త్‌లో RRR రికార్డుని బద్దలుకొట్టిన కల్కి.. బాలీవుడ్‌లో ప్రభాస్ సత్తా..

Date : 23 July 2024 12:09 PM Views : 274

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalki Vs RRR : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ విషయంలో కల్కి సినిమా ఇప్పటికే పలు రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ పేరిట మీద కూడా పలు రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత కల్కి సినిమా 1000 కోట్లు సాధించింది. అమెరికాలో కూడా ఒక్క బాహుబలి 2 రికార్డ్ తప్ప అన్ని రికార్డులని కొల్లగొట్టింది కల్కి. ఇక నార్త్ లో కూడా కల్కి సినిమా భారీ విజయం సాధించింది. కల్కి సినిమా కేవలం నార్త్ లోనే ఇప్పటివరకు 277 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.దీంతో కల్కి సినిమా బాలీవుడ్ లో RRR రికార్డ్ ని బద్దలు కొట్టింది. RRR సినిమా నార్త్ లో లైఫ్ టైం కలెక్షన్స్ 273 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పుడు కల్కి సినిమా ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికి 277 కోట్లు కాగా ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ సినిమాల లిస్ట్ లో మాత్రం కల్కి మూడో స్థానంలో ఉంది. బాహుబలి 2 సినిమా నార్త్ లో 511 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా KGF2 సినిమా 434 కోట్లతో రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు కల్కి 277 కోట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది. దీంతో ఇన్నాళ్లు మూడో ప్లేస్ లో ఉన్న RRR సినిమా 273 కోట్లతో నాలుగో స్థానంకు వెళ్ళింది. ఈ రికార్డులపై ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :