Sunday, 15 March 2026 10:19:34 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Mahesh Babu – Krishna Vamsi : ఇది కరెక్ట్ కాదు.. దయచేసి అలా చేయకండి.. మహేష్ బాబు ఫ్యాన్స్ పై కృష్ణవంశీ ట్వీట్..

Date : 11 August 2024 10:51 AM Views : 312

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mahesh Babu – Krishna Vamsi : ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ క్లాసిక్ హిట్ సినిమా మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని రీ రిలీజ్ ల్లాగే ఈ సినిమాకు కూడా ఫ్యాన్స్ సందడి చేసారు. చాలా మంది అభిమానులు థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసారు. అయితే రీ రిలీజ్ సినిమాల్లో థియేటర్స్ లో ఫ్యాన్స్ తమ హీరోలు, లేదా ఆ సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ ని తెర ముందు రీ క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో మురారి సినిమాలో ఉన్న సూపర్ హిట్ పెళ్లి సాంగ్ ని ఓ జంట రీ క్రియేట్ చేసింది. ఓ థియేటర్ లో మురారి సినిమాలో ‘అలనాటి రామచంద్రుడు..’ పెళ్లి సాంగ్ వస్తున్న సమయంలో ఓ జంట థియేటర్లోనే పెళ్లి చేసుకుంది. అబ్బాయి అమ్మాయి మెడలో థియేటర్లోనే తాళి కట్టగా చుట్టూ ఉన్న వాళ్ళు అక్షంతలు వేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్ సూపర్ అంటూ, మహేష్ ఫ్యాన్స్ అంటే ఈ రేంజ్ ఉంటది అంటూ పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే చాలా మంది పెళ్లిని ఇలా అపహాస్యం చేస్తున్నారని, అభిమానం ఉండొచ్చు కానీ ఇలా పిచ్చి ఉండకూడదని, వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే ఏమంటారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేసి కృష్ణవంశీని ట్యాగ్ చేసి ఇది చూసారా థియేటర్లో పెళ్లి చేసుకున్నారు అని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఈ వీడియో చూసిన కృష్ణవంశీ దీనికి రిప్లై ఇస్తూ.. ఇది కరెక్ట్ కాదు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయడం, అవమానించడం చేయకండి ప్లీజ్ అని పోస్ట్ చేసాడు. దీంతో కృష్ణవంశీ ట్వీట్ వైరల్ గా మారడంతో పలువురు కృష్ణవంశీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆ జంటకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, వాళ్ళు సరదాగా మహేష్ ఫ్యాన్స్ కావడంతో సీన్ రీ క్రియేషన్ చేసారని కామెంట్స్ చేసారు. ఏదేమైనా సినిమాల రీ రిలీజ్ ల వల్ల ఫ్యాన్స్ చేసే కొన్ని పనులు వైరల్ అవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :