Sunday, 08 March 2026 10:49:04 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Siddharth – Aditi Rao Hydari : ఏకంగా అమెరికా వెళ్లి.. యాపిల్ ఫోన్ కొని యాపిల్ సీఈఓతో ముచ్చట్లు పెట్టిన సిద్దార్థ్, అదితి..

Date : 10 September 2024 12:17 PM Views : 282

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Siddharth – Aditi Rao Hydari : ఖరీదైన ఫోన్స్ లో ఒకటైన యాపిల్ తన కొత్త మోడల్ ని ఇవాళ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో యాపిల్ కంపెనీ లాంచ్ చేసింది. దీంతో యాపిల్ ప్రేమికులు ఈ కొత్త సిరీస్ ఫోన్స్ కొనుక్కోడానికి ఎగబడుతున్నారు. ఈ క్రమంలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి కూడా ఈ కొత్త ఐ ఫోన్ 16ని కొనుక్కున్నారు. హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితి గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ఈ జంట అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడ యాపిల్ కంపెనీకి చెందిన స్టీవ్ జాబ్స్ థియేటర్ కి వెళ్లి ఐ ఫోన్ 16ని కొనుగోలు చేసారు. అక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని కలిసి అతనితో కాసేపు ముచ్చటించారు. టిమ్ కుక్ తో దిగిన ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. మర్చిపోలేని, అద్భుతమైన అనుభవం ఇది. టిమ్ కుక్ ఎంతో కూల్ గా మాట్లాడారు. గత రెండు రోజులు మాకు చాలా స్పెషల్. యాపిల్ టీమ్ తో మా చుట్టు క్రియేటివిటీ, టెక్నాలజీతో నిండి ఉన్నాము అని తెలిపారు సిద్దార్థ్, అదితి. అలాగే యాపిల్ సెంటర్ బయట అదితి, సిద్దార్థ్ దిగిన ఫోటోలను షేర్ చేసి ఇద్దరు యాపిల్ ఫ్యాన్స్ మొదటిసారి యాపిల్ ఈవెంట్ కి వచ్చారు అని పోస్ట్ చేసారు. దీంతో సిద్దార్థ్, అదితి యాపిల్ ఐ ఫోన్ కొనుక్కోడానికి అమెరికా వరకు వెళ్లి యాపిల్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసారని జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీరు షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :