Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pranayagodari Song : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ‘ప్రణయగోదారి’ అనే సినిమాతో రాబోతున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఆల్రెడీ ప్రణయ గోదారి సినిమా నుంచి పలు సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని ఐటం సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటను మార్కండేయ రాసి సంగీతం అందించాడు. భార్గవి పిల్లై ఈ పాటను పాడింది. ఈ సాంగ్ లో మాధురి మొండాల్ నర్తించింది.
Admin
Studio18 News